సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రం పై నిర్వహణ అధికార బాధ్యతలు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కి బదిలీ :

Published: Friday February 11, 2022

మధిర ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : మధిర సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రం వంద పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ అయినందున ఆస్పత్రికి సంబంధించిన పూర్తి నిర్వహణ అధికారా బాధ్యతలను DM & HO నుండి తెలంగాణ వైద్య విధాన పరిషత్ కు బదిలీ చేశారని దానికి సంబంధించిన ఖమ్మం జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు గురువారం మధిర సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆస్పత్రిని నిర్వహణ బాధ్యతలు చేపట్టడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి ఎండి. డాక్టర్ కనక పూడి. అనిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ డాక్టర్ శ్రీనివాసు, గైనకాలజిస్ట్ డాక్టర్. మనోరమ మరియు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.