దళిత సంఘాల ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ కు ఘన నివాళులు కరీంనగర్ ఫిబ్రవరి 18 ప్రజాపాలన రిపోర్

Published: Monday February 20, 2023

కరీంనగర్ పట్టణ కేంద్రంలోని  మాతా శిశు ప్రభుత్వ హాస్పటల్ ఎదురుగా భాగ్యరెడ్డి వర్మ చౌరస్తాలో తెలంగాణ దళిత ముద్దుబిడ్డ విద్యాదాత దళిత జనోద్దారకుడు అయినటువంటి మాదరి భాగ్యరెడ్డి వర్మ 85వ వర్ధంతి సందర్భంగా శనివారం దళిత సంఘాల ఆద్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి  ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొరిమి వేణుగోపాల్, బీజేపీ నాయకులు జాన పట్ల స్వామి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు మేడి మహేష్, తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కాడ శంకర్, రాష్ట్ర నాయకులు తాళ్ల వెంకటేష్, దామర సత్యం, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు మొగరం రమేష్, రాష్ట్ర మరియు జిల్లా నాయకురాలు సుంచు లతశ్రీ, జై తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర నాయకులు గంటల మహేందర్, దళిత సీనియర్ నాయకులు కర్ణ పవన్ కుమార్, సదానందం తదితరులు పాల్గొన్నారు.