సమయ పాలన పాటించని వైద్యులు

Published: Tuesday April 27, 2021
చుట్టపు చూపుగా డ్యూటీలకు వస్తు 
పరిగి 26 ఏప్రిల్  ప్రజాపాలన ప్రతినిధి : ప్రాథమిక వైద్య కేంద్రాలలో విధులు నిర్వహించవలసిన వైద్యులు ఉదయం 10:30  గంటలైనా వైద్యులు తమ విధులకు రాలేకపోతున్నారు. మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారని కొందరు అక్కడికి కోవిడ్ టెస్టుల గురించి వ్యక్తులు అనుకుంటున్నారు. చుట్టపుచూపుగా డ్యూటీ లకు వస్తూ పూర్తిస్థాయిలో సమయపాలన పాటించడంలేదని అక్కడక్కడ ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్టర్ మినహా వైద్యులు చుట్టపుచూపుగా తమ తమ డ్యూటీలకు వస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి లో ఎంత మంది ఉన్నా ఎమర్జెన్సీ కోసం కాల్ డ్యూటీ పైన ఆధారపడటం శోచనీయం. ఇకనైనా అధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పేషంట్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టలని మండల పరిధిలో లోని వివిధ గ్రామాల నుంచి ఆసుపత్రి వచ్చిన  పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ వెంటనే స్పందించి దోమ మండల కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సక్రమంగా విధులు నిర్వహిoచని సమయ పాలన పాటించని వైద్యులపై చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల నుంచి కరోనా టెస్టులకు వచ్చిన పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.