ఒప్పంద పద్ధతిన మెడికల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

Published: Tuesday June 14, 2022
జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
 
మంచిర్యాల టౌన్,జూన్13, ప్రజాపాలన :  రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కమీషనర్ ఆదేశాల మేరకు ఎన్.యు. హెచ్.ఎం. యు.పి.హెచ్.సి.ఎన్. - మంచిర్యాలలో రెండు మెడికల్ అధికారుల పోస్టులను ఒప్పంద పద్దతిన భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా నియామక కమిటీ చైర్మన్ భారతి హోళ్ళికరి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారములు, నోటిఫికేషన్, ఇతర వివరాలను జిల్లా అధికారిక వెబ్సైట్mancherial.telangana.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవాలని, ఈ నెల 15 నుండి 18వ తేదీ వరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు రుసుము 300 రూపాయలను జిల్లా వైద్య,ఆరోగ్య అధికారి మంచిర్యాల పేరున ఏదైనా జాతీయ బ్యాంక్ డి.డి. రూపంలో చెల్లించవలసి ఉంటుందని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.