ఆహ్లాదకరమైన వాతావరణంలో గృహ నిర్మాణం

Published: Monday July 05, 2021
శతాబ్ది టౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
వికారాబాద్, జూలై 04, ప్రజాపాలన బ్యూరో : స్వచ్ఛమైన ఔషధ మొక్కల వాతావరణంలో గృహాలు నిర్మించడం ఆరోగ్యాని శుభదాయకమని శతాబ్ది టౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరి పల్లి సమీపంలో సిల్వర్ స్పేస్ ది స్మార్ట్ సిటీ వెంచర్ వివరాల గురించి విలేఖరుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరసమైన ధరలకు సిల్వర్ స్పేస్ లో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 23 ఎకరాలలో 277 ప్లాట్లు ఏర్పాటు చేయనైనదన్నారు. 147 గజాల ప్లాటు నుండి 275 గజాల వరకు ప్లాట్లు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. డిటిసిపికి అనుగుణంగా ప్లాట్లు ఏర్పాటు చేశామని అన్నారు. అనంతగిరీ కా హవా లాఖో మరీజోంకా దవా వాతావరణంలో స్వంత ఇంటిని నిర్మించుకుంటే ఏ ఆరోగ్య సమస్యలు దరిదిపుల్లోకి రావని భరోసా కల్పించారు. వెంచర్ చుట్టుపక్కల లైఫ్ విశ్వవిద్యాలయం, రైల్వే జంక్షన్, రవాణా వ్యవస్థ, ఆకర్షణీయమైన దేవస్థానాలు, ప్రశాంత వాతావరణం ఉన్నదని కొనియాడారు. ఆసక్తిగల కొనుగోలుదారులు వెంచర్ కు వచ్చి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు క్రిష్ణ, వేణుమాధవ్ రెడ్డి లు పాల్గొన్నారు.