48 గంటల్లో నిందితునీ అరెస్ట్ మీర్ పేట పోలీసులు

Published: Friday February 05, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; రాచకొండ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీ టీచర్స్ కాలనీ లో మహిళపై గొడ్డలితో దాడి చేసి, హత్య చేయటానికి ప్రయత్నించిన కేసులో అబ్దుల్లాపూర్మెట్ టు కు చెందిన చెరుకు రాహుల్ గౌడ్ ను అరెస్టు చేసిన మీర్ పేట్ పోలీసులు. వివాహితపై వేధింపులకు గురై, జైలుపాలు చేసిందని విమల పై పగ పెంచుకున్నా అతడు రగిలిపోయిన రాహుల్ గౌడ్ గుర్రం గూడా లో ఉన్న టీచర్స్ కాలనీ వివాహిత మైన ఆమె ఇంటికి వెళ్లి, ఇంటి ఎదురుగా నిలిచిన విమల పై గొడ్డలి తో ఆవేశంగా ఆమె వైపు దూసుకెళ్ళాడు. గొడ్డలి తో వేయడం వల్ల  కుడి భుజం పై, మోచేతిపై బలంగా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమై అతని పట్టుకునేందుకు ప్రయత్నించారు. విఫలమయ్యారు. స్థానికులు 100 కు ఫోన్ చేయగా ఘటనా స్థలానికి మీర్ పేట్ పోలీసులు చేరుకున్నారు. అప్పటికే బాధితురాలని నవీన్ హాస్పిటల్లో చేర్పించారు. వివరాలు సేకరించిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. రాచకొండ ఏసిపి మీర్ పేట సిఐ కథనం ప్రకారం  సి సి ఫుటేజ్ ప్రకారంగా 48 గంటల్లో సాంకేతిక సాక్షాలతో నిందితుడిని పట్టుకున్న మీర్ పేట్ పోలీసులు. సీసీటీవీ లో రికార్డ్ అయిన విజువల్స్ ఆధారంగా చెరుకు రాహుల్ గౌడ్ అని గుర్తించామని చెప్పారు. అబ్దుల్లాపూర్ మెట్ లో అవుటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో నిందితుని పట్టుకున్నారు. పిడి యాక్టివ్ తో పాటు రౌడీ షీటర్ ఓపెన్ చేసారు. అతని వద్ద గొడ్డలి టూవీలర్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.