కలయిక వాకర్స్ క్లబ్ ఆఫీస్ బిల్డింగ్‌కు స్థలవితరణ

Published: Monday July 18, 2022
మధిర జులై 17 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడుమధిర కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టిఆర్ఎస్ నాయకులు కరివేద సుధాకర్, చావా రవికుమార్ ఈరోజు 300 చదరపు గజాల స్థలాన్ని, మధిరలోని కలయిక వాకర్స్ క్లబ్ ఆఫీసు బిల్డింగ్ నిర్మాణం నిమిత్తము వితరణచేసారు. కలయిక వాకర్స్ క్లబ్ ఆవిర్భావంనుండి చేస్తున్న సామాజిక కార్యక్రమాలను ప్రశంసిస్తూ, క్లబ్ కార్యకలాపాల నిమిత్తం ఏర్పరచుకోబోయే బిల్డింగ్‌కు ఈ స్థలము ఉచితంగా ఇవ్వనున్నట్లు కరివేద సుధాకర్, చావా రవి తెలియచేసారు. స్థల వితరణ పట్ల వాకర్స్ క్లబ్అధ్యక్షులుఇరుకుళ్ళబాలకోటేశ్వరరావు, క్లబ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ పాలకవర్గం కరివేద సుధాకర్ ను వారి స్వగృహంలో కలిసి దుశ్శాలువ పుష్ప గుచ్చముతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు
 
 
 
Attachments area