*విద్యారంగాన్ని మరో మారు విస్మరించిన రాష్ట్ర బడ్జెట్* *- PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం

Published: Tuesday February 07, 2023

చేవెళ్ల జనవరి 6, ( ప్రజాపాలన):-
            
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశం ముందు అపూర్వ ఆదర్శాన్ని నిలబెట్టిందని, సంక్షేమంలో స్వర్ణ యుగాన్ని సృష్టించిందని, అభివృద్ధిలో మానవ కోణం అద్దిందని గంభీర ఉపన్యాసాలు చేసిన సర్కారు చాలా ముఖ్యమైన, ప్రాధాన్యరంగమైన విద్యారంగాన్ని మాత్రం ప్రస్తుత బడ్జెట్లో ఆనవాయితీగా మరో మారు విస్మరించింది,నిరాశపరిచింది. 
ఈరోజు తెలంగాణ సర్కారు ₹2,90,396 కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో విద్యారంగానికి అత్యల్పంగా నిరాశాజనకంగా కేవలం ₹19093 కోట్లు మాత్రమే కేటాయించింది. అనగా కేవలం 6.57%  శాతం మాత్రమే కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రాధాన్యతా రంగంగా గుర్తించడం లేదని మరో మారు తేటతెల్లమైంది. ఇది అత్యంత శోచనీయం.విద్యా రంగానికి కేటాయించిన బడ్జెట్లో పాఠశాల విద్యారంగానికి ₹16092 కోట్లతో 5.54%, మరియు ఉన్నత విద్యకు ₹3001 కోట్ల రూపాయలతో ఒక శాతం కేటాయించి నిరుత్సాహపరిచిందని మండిపడ్డారు.