ప్రభుత్వ ప్రజావ్యతిరేక విదానాలపై ఎంసిసిపిఐ (యు) నిరసన

Published: Thursday July 01, 2021

బెల్లంపల్లి, జూన్ 30, ప్రజాపాలన ప్రతినిధి : పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి కరోనను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఏం సి పి ఐ (యు) రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు భారత రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తూ బుధవారం నాడు స్థానిక ఆర్డిఓ కి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణ  మాట్లాడుతూ ఒక వైపు కరోనా తో ప్రజల జీవితాలు దుర్భరంగా మారి ఉద్యోగ,ఉపాది అవకాశాలు దెబ్బతిని కనీస నిత్యావసర వస్తువులు కొనుక్కుని తినే స్థోమత కూడా లేకుండా పోయిందిని, ఇదే అదునుగా కేంద్ర ప్రభుత్వం మే నెల నుంచి ఇప్పటి వరకు సుమారు 23 సార్లు పెట్రోల్,డిజిల్ రేట్లు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపాయని అన్నారు. పెట్రోల్, డిజిల్ రేట్ల పెరుగుదల వలన రవాణా చార్జీలు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని అన్నారు. కరోనా తో ప్రజల జీవనం అతలాకుతలం కాగా మూలిగే నక్క పై తాడి పండ్లు పడ్డట్టు ప్రజలపై ఈ చార్జీల భారాన్ని వేయటం ప్రజా ప్రభుత్వం యొక్క ధర్మం కాదని అన్నారు, అన్నీ వ్యాపార సంస్థలను జి యస్ టి పరిధి లోకి తెచ్చినట్లు పెట్రోల్, డిజిల్ ను తేక పోవటం కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బడా కార్పొరేట్ శక్తులు అయిన ఆదాని, అంబానీల కనుసన్నల్లో పాలన చేస్తున్న కేంద్రం లోని బి జె పి మోది ప్రభుత్వం ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను బలి పశువు లను చేయటం శ్రేయస్కరం కాదని అన్నారు. ఒకవైపు రెండొవ వేవ్ కరోనా వచ్చిన సరిఅయిన ముందు జాగ్రత్తలు చేపట్టక పోగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలను జలగల్లా పీడించిన నియంత్రణ చేయలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  కరోనా మృతుల కుటుంబాలకు ప్రజాస్వామ్య ప్రభుత్వంగా భరోసా కల్పించటంలో ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు, కోర్టు జోక్యం చేసుకుంటూ హెచ్చరిక చేసిన ఇప్పటి వరకు కరోనా మృతుల కుటుంబాలకు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించకుండా, కాలయాపన చేస్తున్నారని అన్నారు, ఇప్పటికైనా తెల్ల రేషన్ కార్డులు కలిగిన ప్రతి పేద కుటుంబానికి రూ,7500 లు ఇవ్వడం ప్రజా సంక్షేమం కోరుకున్న ప్రభుత్వం బాధ్యతగా అమలు చేయాలని అన్నారు. మన దేశంలో కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు కొంత మేరకు సహాయం చేస్తున్న ఇది కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేయక పోవటం బాధ్యతారాహిత్యంగా భావించి ప్రభుత్వానికి మీ రైనా సరైన ఆదేశాలు ఇచ్చి ప్రజలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ఆయన రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. తక్షణమే ఈ డిమాండ్స్ ను అమలు చేయాలని కోరారు రోజు, రోజుకు పెంచుతున్న పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గించాలని పెట్రోల్, డిజిల్ ను జి యస్ టి పరిధిలోకి తీసుకురావాలని, పెట్రోల్, డిజిల్ ధరలు పెరుగుదల కారణంగా పెరిగిన అన్నీ రకాల నిత్యావసర వస్తువుల ధరలను సామాన్య ప్రజల కు అందుబాటులోకి తేవాలని, కరోనా వలన మరణించిన ప్రతి కుటుంబానికి రూ 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కరోనా మూడవ వేవ్ ప్రచారం కారణంగా అన్నీ రకాల ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండ శ్రీనివాస్, సబ్బని రాజేంద్రప్రసాద్, పసులేటి వెంకటేష్, ఆరేపల్లి రమేష్, బర్ల స్రవంతి, దుర్గం విఠల్, కామెర పద్మ, దుర్గం పీరయ్య, లింగంపల్లి శంకర్, బండి మల్లేష్, కిష్టయ్య, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.