టెట్ మోడల్ పేపర్ పరీక్ష నిర్వహణలో టి పి టి ఎఫ్ కృషి అభినందనీయం.

Published: Monday May 09, 2022
అదనపు జిల్లా కలెక్టర్ జీ.వి శ్యామ్ ప్రసాద్ లాల్
కరీంనగర్, మే 7 ప్రజాపాలన ప్రతినిధి : పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అందరు కూడా మొదట మానసిక ఒత్తిడి నుండి బయట పడి లక్ష్యం వైపు మాత్రమే గురిపెట్టి దానికి అనుగుణమైన ప్రణాళికను రూపొందించుకుని ముందుకు సాగాలని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ జీ.వి శ్యామ్ లాల్ ప్రసాద్ పిలుపు నిచ్తారు. ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని వినియోగించుకొని విజయం సాధించాలని కోరారు. శనివారం నాడు టి.ఫి.టీ.ఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో టి.పి.టీ.ఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పోరెడ్డి దమోధర్ రెడ్డి అధ్యక్షతన శ్రీ వికాస్ అకాడమీ వారి సౌజన్యంతో టెట్ మోడల్ టెస్ట్ కరీంనగర్ లోని ఓ గార్జెనే లో 9-00 నుండి 12. గంటల వరకు నిర్వహించిన మోడల్ పరీక్షకు కేంద్రాన్కి ఆయన హజరయ్యారు. ఈ సందర్బంగా జీవి శ్యామ్ ప్రసాద్ లాల్  మాట్లాడుతూ ప్రభుత్వం 317 జీవో ద్వారా స్థానికులకు 95 శాతం ఉద్యోగాలలో అవకాశం కల్పించిందనిఅది అనుభవించే మొదటి బ్యాచ్ మీది కావడం ఎంతో ఆభినందనీయమని కొనియాడారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. ఇంతటి చక్కటి ప్రోగ్రాం ను రూపొందించి నిర్వహించిన టి.పి.టి.ఎ.ఫ్ జిల్లా శాఖను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాధికారి సి.హెచ్.వి.ఎస్ జనార్దన్ రావు మాట్లాడుతూ.. టి పి టి ఎఫ్ రూపొందించిన ఈ చక్కటి అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకొని తమ సామర్థ్యాన్ని పరీక్షించుకుని మెరుగైన ఫలితాల కోసం కృషి చేసి అందరూ ఉపాధ్యాయులు గా విజయం సాధించాలని కోరారు. టి. పి .టి. ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. 1998 నుండి టి. పి. టి .ఎఫ్ ఆధ్వర్యంలో డీఎస్సీ మోడల్ టెస్టులు నిర్వహిస్తూ అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడింది అని కొనియాడారు. తెలంగాణ మొత్తం లో ఇంత పెద్ద ఎత్తున మోడల్ టెట్  పరీక్ష నిర్వహించడం ఇదే  మొదటిసారి అన్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి 22 వేల పైచిలుకు ఉన్న టీచర్ పోస్టు ల ఖాళీలు వెంటనే ప్రకటించి డీఎస్సీని కూడా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులు మొక్కవోని ధైర్యంతో తమ లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టి.పి.టి.ఎఫ్  అదనపు ప్రధాన కార్యదర్శి నన్నే భోయిన తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిషన్రావు రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. చంద్రశేఖర్ రావు. జిల్లా కార్యవర్గం రామచంద్రారెడ్డి, శ్రీనివాస్, బాలయ్య, టి.రాజయ్య, బి. సంధ్య రాణి, జానకీదేవి, టి పి టి ఎఫ్ పెద్దపల్లి జిల్లా అద్యక్షులు బి. పర్ష రాములు చైర్మన్ వెంకటేశ్వర్లు గారు మరియు 800 మంది అభ్యర్థులు పాల్గొన్నారు