ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 24ప్రజాపాలన ప్రతినిధి ***బహుజన్ సమాజ్ పార్టీతెలంగాణ రాష్ట్రం అధ్య

Published: Saturday February 25, 2023
చట్టాలను ఉల్లంఘిస్తూ
ఖదీర్ ఖాన్ చావుకు కారణమైన పోలీసు అధికారులను కేవలం సస్పెండ్ చేసినంత మాత్రాన న్యాయం జరిగినట్లు కాదు. కేసు నమోదు చేసి హంతకులైన నేరస్థులకు కఠిన కారాగార శిక్ష వేయాలి.
ఇలాంటి అమానవీయ ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చట్టాలను సవరించాలి. ఖదీర్ ఖాన్ కుటుంబ సభ్యులకు కోటి రూపాల ఎక్స్ గ్రేషియా, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం,పిల్లల చదువు బాధ్యత,డబల్ బెడ్రూం ఇళ్లు,ఒక ఎకరం భూమిని ప్రకటించి వెంటనే అందజేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. గతంలో మరియమ్మ, మక్కా మసీదు విచారణ పేరుతో అమాయక ముస్లీం యువకులను వేధించడం లాంటి ఘటనల ద్వారా ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోన్న ఉదంతాలను కూడా బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది.ఈ కార్యక్రమంలో.. మైనారిటీ సోదరులు హైమద్, సమీర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లింగం స్వెరో   జిల్లా కార్యదర్శి అసెంబ్లీ ఇంచార్జీ *పల్లాటి రాములు , అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి గోపగళ్ళ దాస్  ఆదిభట్ల మున్సిపాలిటీ అధ్యక్షులు బంగారిగల్ల మహేందర్  ఇబ్రహింపట్నం మండల అధ్యక్షులు మచ్చ మహేందర్ , అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి చిత్రం కృష్ణ , బంగారి మైసయ్య , గ్యార రవి గ, పోల్కంపల్లి సెక్టార్ నాయకులు పెద్ద ముత్తని గణేష్  గంగిరెడ్డి సుధాకర్ రెడ్డి , మునుగనూర్ బాబయ్య , తదితరులు పాల్గొన్నారు.