కెసిఆర్ జన్మదిన కానుకగా మొక్కలు నాటాలి

Published: Wednesday February 17, 2021
వలిగొండ ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత జన నాయకులు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ సభ్యులు సంతోష్ ఆధ్వర్యంలో చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో మండల వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటి కెసిఆర్ జన్మదిన కానుకగా అందించాలని మండల పరిధిలోని వెల్వర్తి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ జిల్లా నాయకులు తక్కెళ్ళ సంజయ్ పార్టీ శ్రేణులను మంగళవారం కోరారు. గ్రీన్ ఛాలెంజ్ లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో మండలం నిలవాలని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యధికంగా మొక్కలు నాటి మరపురాని జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యమంత్రి కి ఇవ్వాలని ఆయన అన్నారు. మొక్కలు నాటడం తో పాటు ప్రత్యేక శ్రద్ధతో వాటిని సంరక్షించినప్పుడే మొక్కలు నాటిన కృషి ఫలిస్తుందని, భావి తరాలకు తరగని సంపద అందించిన వారవుతారు అని ఆయన అన్నారు.