విద్యార్థికి చదువు రాకపోతే అది ఉపాధ్యాయుల బాధ్యత: జిల్లా కలెక్టర్ గౌతం

Published: Wednesday December 14, 2022
బోనకల్, డిసెంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి: మీరు పట్టించుకోని విద్యార్థి భవిష్యత్తులో అబ్దుల్ కలాం కావచ్చుగా అని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ప్రధానోపాధ్యాయులను ప్రశ్నించారు. మండల పరిధిలోనే తూటికుంట్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావుని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. మధిర నియోజకవర్గ స్థాయి మన ఊరు- మనబడి పై ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ప్రత్యేక సమావేశాన్ని మంగళవారం బోనకల్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యా బోధనపై, మన ఊరు - మనబడి పురోగతిపై ప్రధానోపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనం తొలి మెట్టు ఎక్కామో లేదో గాని విద్యార్థులను మాత్రం తొలి మెట్టు ఎక్కించాలని ఆదేశించారు. మీటింగ్ పెట్టుకుని మీటింగ్ అయిపోయింది అనుకోవచ్చు కానీ ఆ మీటింగ్ వలన నేర్చుకొని విద్యార్థులలో ఏమేరకు ఫలితాలను సాధించామో ఉపాధ్యాయులు ఆలోచించుకోవాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు ఉంటారని, ఆ విద్యార్థులను ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎలా తయారు చేసామో అనే విషయాన్ని మీరు గుర్తిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. పాఠశాలలో విద్యార్థులకు చదవటం, రాయటం నేర్పించాలి. రాని వారిని గుర్తించి వారికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అక్షరాలు నేర్పించడం, చదువు వచ్చేలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం విద్యార్థులకు సరఫరా చేస్తుందని, కానీ వాటిని బోధించకుండా మరల మీరు వర్క్ బుక్స్, నోటుబుక్స్ అంటూ ఎందుకు బోధన చేస్తున్నారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఉపాధ్యాయులు బోధన సమయంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ వారిని ప్రశ్నించారు. నేను మాట్లాడిన విషయాల్లో మీకు ఏమి అర్థమైందని కలెక్టర్ వారిని ప్రశ్నించారు. వికలాంగులు పై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యాబోధన ప్రత్యేకంగా చేయాలని సూచించారు. విద్యార్థికి చదువు రాకపోతే అది ఉపాధ్యాయుల బాధ్యత అని సూచించారు. మోటమర్రి ప్రధానోపాధ్యాయులు విద్యా బోధనపై ప్రశ్నించగా మాక్సిమం, ట్రై చేస్తానని అనటంతో కలెక్టర్ ఆయన పై ప్రశ్నల వర్షం కురిపించారు. మాక్సిమం అంటే ఏమిటని కలెక్టర్ ప్రశ్నించడంతో ఆ హెచ్ ఎం మౌనంగా ఉండిపోయారు.చదవటం, రాయటం చతుర్విధ ప్రక్రియలను సాధించటానికి 100 శాతం లక్ష్యం సాధిస్తామని ప్రధానోపాధ్యాయులందరూ డిసెంబర్ 20 నాటికి డిక్లరేషన్ ఇవ్వాలని కోరారు. దీంతో ప్రధానోపాధ్యాయులందరూ అందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ 100 శాతం డిక్లరేషన్ సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రధానోపాధ్యాయులను విద్యా బోధనపై ప్రసన్న వర్షం కురిసించారు. దుస్తుల కలర్ ఆధారంగా ప్రధానోపాధ్యాయులను లేపి ప్రశ్నల వర్షం కురిపించారు.
 
 తూకుంట్ల హెచ్ఎం రామారావుపై ప్రశంసలు:
 
మండల పరిధిలోని తూటికుంట్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామారావుని విద్యాబోధనపై కలెక్టర్ వి పి గౌతమ్ ప్రశ్నించారు. టెస్ట్ పుస్తకం దేనికి అని కలెక్టర్ ప్రశ్నించారు. దీంతో రామారావు పిల్లలు నేర్చుకోవడానికి ఉపయోగపడే సాధనమని సమాధానం ఇచ్చారు. ఏమి నేర్చుకుంటారు అని కలెక్టర్ ప్రశ్నించారు. మౌఖిక, భాష, గణితం, సామర్ధ్యాలను ఆనందంగా, సరళంగా నేర్చుకోవటానికి అన్ని అంగులతో, ఆకర్షణేయంగా పాఠ్యపుస్తకాలు ఉంటాయని సమాధానం చెప్పారు. దీంతో కలెక్టర్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ, ఏఎమ్ఓ కేశవపట్నం రవికుమార్ ,సెక్టోరియల్ ఆఫీసర్ సిహెచ్ రామకృష్ణ ,బోనకల్, మధిర, ఎరుపాలెం మండలాల ఎంఈఓ ఎర్రం దాసు ప్రభాకర్, చింతకాని ఎంఈఓ మోదుగు సాంసంగ్, ముదిగొండ ఎంఈఓ బివి రామాచారి, మండల నోడల్ ఆఫీసర్లు, క్లస్టర్ నోడల్ ఆఫీసర్లు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, బోనకల్ ఎంపీడీవో బోడేపూడి వేణు మాధవ్, డిప్యూటీ తాసిల్దార్ సంగు శ్వేత తదితరులు పాల్గొన్నారు.