ప్రభుత్వం రైతులకు ఎకరానికి 30 వేల రూపాయలు పంట నష్టం చెల్లించాలి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్

Published: Monday April 03, 2023

మధిర ఏప్రిల్ 2 ప్రజాపాలన ప్రతినిధి:మధిర మండలంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను ఆదివారం మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ సందర్శించి రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు. అకాల వర్షాల వల్ల పిడుగులు వల్ల రైతులు బాగా నష్టపోయారు ఎకరం మొక్కజొన్నకి 30 వేల వరకు పెట్టుబడి పెట్టారు.. ఈ సంవత్సరం పురుగు ఉధృతంగా ఉండటం వల్ల ఎక్కువసార్లు మందు కొట్టాల్సి వచ్చింది అయినా సరే రైతు మందులు కొట్టి పంటను బతికించుకుంటున్న తరుణంలో ఈ అకాల వర్షాల వల్ల కంకి గింజ పోసుకునే తరుణంలోనే కింద పడిపోవడం వల్ల అది సచ్చు కింద అయ్యే అవకాశం ఉంది. పంటకు ఎకరానికి 30,40 వేలు నష్టపోయే పరిస్థితి ఉంది ప్రభుత్వం వెంటనే రైతులకు ఎకరానికి 30 వేల రూపాయల ఆర్థిక సహాయం చెల్లించి ఆదుకోవాలి లేకపోతే భవిష్యత్తులో రైతులు పంటలు పండించే పరిస్థితి ఉండదు ఈ సంవత్సరం రైతులు ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పంట వేశారు పంట చేతికి వస్తుంది అని ఆశపడ్డ తరుణంలో ఈ అకాల వర్షాల వల్ల రైతులు పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది 30,40 వేల వరకు లాభం వస్తుంది అనుకున్న పంటకు అసలు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. కావున ప్రభుత్వం వెంటనే రైతులకు ఎకరానికి 30 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేసి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు..