హిందూ సంఘటన, విశ్వగురువు గా భారత్ ఆర్.ఎస్.ఎస్ ధ్యేయం

Published: Tuesday December 27, 2022

రాయికల్, డిసెంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి):
హిందూ ధర్మ పరిరక్షణ,  స్వాభిమాన, స్వావలంబన, నిత్యశాఖ ద్వారా  దేశభక్తి కలిగిన ఉన్నతమైన వ్యక్తి నిర్మాణమే ధ్యేయంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పని చేస్తుందని కరినగర్ విభాగ్ సహ ప్రచారక్ భానుప్రకాష్ జీ అన్నారు. రాయికల్ మండల కేంద్రములోని ఆర్.ఆర్ గార్డెన్ లో రెండు రోజులపాటు జరిగే ఆర్.ఎస్.ఎస్. జిల్లా స్థాయి ఘోష్ వర్గ (భారతీయ సంగీత) ఉద్ఘాటన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య వక్తగా పాల్గొని మార్గదర్శనం చేసారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శక్తివుంటే శివం శివం శక్తి లేకుంటే శవం శవం అని  స్వామి వివేకానంద అన్నట్లుగా, సంఘేశక్తి కలౌయుగే చెప్పుకుంటున్నట్లుగా హిందూ సంఘటన, ఐక్యత అవసరమని అన్నారు. సంఘంలో ఘోష్ యొక్క ప్రాధాన్యత ను తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి కడపటి రమేష్ రెడ్డి, వర్గ కార్యవాహ్ సిద్ధ గంగారజం, జిల్లా ఘోష్ ప్రముఖ్ సుద్దాల మల్లేశం, జిల్లా సహకార్యవాహ్ సాయిమధూకర్, స్వయంసేవకులు తదితరులు పాల్గొన్నారు.