తెలంగాణ బడ్జెట్ లో 500 కోట్లతో గల్ఫ్ బోర్డ్ కు నిధులు కేటాయించాలి. తెలంగాణ గల్ఫ్ వ్యవస్థాపక అధ

Published: Thursday February 02, 2023
 జన్నారం, ఫిబ్రవరి 01, ప్రజాపాలన:
 
ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీ మేరకు
 తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో రూ.500 కోట్లతో గల్ఫ్ సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని  తెలంగాణ గల్ఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కళ్యాణ భూమయ్య  డిమాండ్ చేశారు.  బుధవారం తెలంగాణా గల్ఫ్  కార్మికుల సంక్షేమ సమితి  దుబాయ్ శాఖ అధ్యర్యంలో  దుబాయ్ లో తెలంగాణ కార్మికుల సంక్షేమ సమితి నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి  శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా  స్థానిక విలేఖర్లతో దుబాయ్ నుంచి ఫోన్ లో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ బాధితుల సమస్యలపైన పోరాడుతూ ,  గల్ఫ్ ఉద్యమాలలో పాల్గొంటూ, చనిపోయిన గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తూ,  ఇబ్బందుల్లో ఉన్న గల్ఫ్ కార్మికులకు జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా తమ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ శాఖ అధ్యక్షుడు మహమ్మద్ హలీం, బర్ దుబాయ్  కోహడినేటర్ కునారపు రమేష్  కల్లెడ నర్సయ్య, సాయి కడం మండల అధ్యక్షులు ధర్మజీ సత్తన్న, దుబాయ్ కోఆర్డినేటర్స్ రాంరెడ్డి, సింగ సాని రమేష్, సింగ సాని సతీష్, దండవేణి వినోద్, చొప్పరి శ్రీనివాస్, గంగారం, బుర్ర గడ్డ వెంకటేష్ గౌడ్, మెరుగు సత్య గౌడ్, లక్సెటిపెట్ ఇంచార్జ్ సాయికుమార్, నంబయ్య, రామన్న, మహేష్, శ్రీనివాస్, గణేష్, ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, ఆంధ్ర ప్రదేశ్ చెందిన గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు.