ప్రజా సమస్యలపై సిపిఎం దశలవారి పోరాటం

Published: Friday July 22, 2022

మధిర రూరల్ జులై 21 ప్రజా పాలన ప్రతినిధి మధిర పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సిపిఎం పార్టీ దశల వారి ఉద్యమం చేపడుతుందని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు పేర్కొన్నారు. గురువారం స్థానిక బోడెపుడి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తానని చెప్పిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది ఏళ్లలో పట్టణంలో ఒక్కరికి కూడా డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు. పట్టణంలో నిర్మాణంలో ఉన్న  డబుల్ బెడ్ ఇళ్ళు రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందజేయాలన్నారు. లేని పక్షంలో పేదల చేత సీపీఎం ఆధ్వర్యంలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించే ప్రదేశంలో గుడిశలు వేపిస్తామని ఆయన అన్నారు. మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని రహదారులన్ని ధ్వంసం అయ్యాయని తక్షణమే రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలన్నారు. అదేవిధంగా పట్టణంలో డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేయాలని, ఖాళీ స్థలాల్లో పెరిగిన చెట్లను తొలగించాలన్నారు. మడుపల్లిలో లెదర్ పార్కు ఏర్పాటు చేయాలని, పట్టణంలో తొలగించిన బడ్డీ కొట్ల చిరు చిరువ్యాపారులకు జీవనోపాధి కోసం ప్రభుత్వ స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేయాలన్నారు. మెయిన్ రోడ్డులో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు పాపినేని రామ నర్సయ్య, మండవ పనీంద్ర కుమారి, రాధ కృష్ణ, పడి కంటి మురళి, పెంటి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.