భీంరావ్ రాంజీ యూత్ సేవలు ప్రశసంనీయం సర్పంచ్ పుల్లమ్మ

Published: Tuesday June 08, 2021
పాలేరు, జూన్ 7 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా:- నేలకొండపల్లి మండలంలోని కోనాయిగూడెం గ్రామంలో లో కోవిడ్ బాధితులకు భీంరావ్ రాంజీ యూత్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని కోనాయిగూడెం సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ పేర్కోన్నారు. మండలంలోని కోనాయిగూడెంలో కోవిడ్ బాధితులకు యూత్ ఆధ్వర్యంలో దాతలు కళ్యాణి, నగేష్ దంపతులు సోమవారం మాంసాహారం భోజనంను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో కోవిడ్ బాధితుల కోసం యూత్ సభ్యులు గత కొన్ని రోజులు గా అనేక సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ రహిత గ్రామం గా తీర్చిదిద్దేందుకు చేస్తున్న పోరాటంలో యూత్ సభ్యులు తన వంతుగా సహకారం అందిస్తున్నారని అన్నారు. సమాజం బాగు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న యూత్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు వుల్లోజి శ్రీకాంత్, ఆశా కార్యకర్త చెరుకుపల్లి బేబి, సభ్యులు వుల్లోజి నరసింహారావు. వి.వెంకటేష్,  వి.ప్రవీణ్ కుమార్, దండుగల శివ, నలగాటి నాగరాజు, పెండ్ర ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.