బ్యాగ్ ఫిల్లింగ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలి

Published: Friday December 10, 2021
ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్
వికారాబాద్ బ్యూరో 09 డిసెంబర్ ప్రజాపాలన : ప్రతి నర్సరీలో నిర్దేశించిన బ్యాగ్ ఫిల్లింగ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్ సంబంధిత కార్యదర్శులకు సూచించారు. గురువారం మర్పల్లి మండల పరిధిలోని వీర్లపల్లి, సిరిపురం, కొతులాపూర్ గ్రామ పంచాయతీలలోని నర్సరీలను సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలలో ఎన్ని బ్యాగ్ ఫిల్లింగ్ పనులు పూర్తయ్యాయని కార్యదర్శులను అడుగగా సుమారు 11 వేల వరకు పూర్తయ్యాయని వివరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఈ నెల10 వ తేదీ వరకు 15000 బ్యాగ్ ఫిల్లింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. నర్సరీలలో వివిధ రకాల విత్తనాలు వేసి అనునిత్యం నీరందించాలని ఆదేశించారు. ఉపాధి హామీకి సంబంధిచిన 7 రిజిష్టర్లను తనఖీ చేయనైనదన్నారు. రిజిష్టర్లను ఎప్పటి కప్పుడు అప్డేట్ చేయాలని వివరించారు. నర్సరీ రిజిష్టర్లకు సంబందించిన స్టాక్ రిజిష్టర్లు అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. లేబర్ రిపోర్ట్  50 మంది కచ్చితంగా ఉండే విధంగా చూడాలని హితవు పలికారు. లేని ఎడల చర్య తీసుకొనబడునని తెలిపారు. పెండింగులో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదేశించాడు. తదుపరి ఆసరా పెన్షన్ల పంపిణీని పరిశీలించారు. మొత్తం 138 ఆసరా పెన్షన్ దారులలో 13 మంది బెడ్ రైజర్స్ ఉన్నారని బిపిఎం తెలిపారు. పెన్షన్ నెలసరి ఇచ్చిన డబ్బులు బుక్ లో వెంటనే ప్రతి నెలా వ్రాయాలని బుక్కులు లేని వారికి కొత్త పుస్తకాలు ఇవ్వాలని బీపీఎం ను అదేశించాడు. అవెన్యూ ప్రకృతి వనంలో మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు పోయాలని, మొక్కలు బ్రతికించే బాధ్యత గ్రామ పంచాయితీ సర్పంచ్ కార్యదర్శులపై ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీర్లపల్లి సర్పంచ్ సుధాకర్ రెడ్డి కార్యదర్శి ఆనంద్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.