ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలి - జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Friday September 17, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి): కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత కోరారు. రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు గురువారం కథలపూర్ మండలం తండ్రియల్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరలు దాటిన ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని కరోన లక్షణాలు ఉంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండ వెంటనే సమీపంలోని పీహెచ్సీ కేంద్రాల్లో చూపించుకోని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి ఎంపీపీ రేవతి జడ్పీటీసీ నాగం భూమయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రావు వైస్ ఎంపీపీ కిరణ్ రావు సర్పంచ్ గంగ ప్రసాద్ మెడికల్ సిబ్బంది అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.