పొడి చెత్త, తడి చెత్త, ప్రజలకు అవగాహన

Published: Friday February 12, 2021
బాలాపూర్ : ప్రజాపాలన; బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం నాడు స్వచ్ఛ సర్వేక్షన్ 2021 సంవత్సర లో భాగంగా పనిచేస్తున్న నగర దీపిక లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహిస్తూ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఆమె మాట్లాడుతూ..... బడంగ్ పేట్ కార్పోరేషన్ లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలిని  చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త సేకరణ చేసే వారికి చెప్పాలని నగర దీపికల తో అన్నారు. చెత్త సేకరణ చేసే వారికి కూడా అవగాహన కల్పించడంలో ఒక భాగమని చెప్పారు. తడి చెత్త , పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి ప్రతి ఒక్కరు ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, ప్రజలను చైతన్య వంతులను చేయాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో  డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, శానిటేషన్ ఇన్సిపెక్టర్ యాదగిరి, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్ ఓ చంద్రశేఖర్ రెడ్డి, కార్పొరేషన్ సిబ్బంది, నగర దీపికలు, తదితరులు పాల్గొన్నారు.