ఉద్యోగ నోటిఫికేష్ వెంటనే విడుదల చేయలి

Published: Wednesday August 04, 2021
పాలేరు ఆగస్ట్ 3 (ప్రజాపాలన ప్రతినిధి) : షబ్బీర్ మృతి కి ప్రభుత్వమే కారణం అని (డివై యాఫ్ ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్ అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ లు లేక ఉపాది లేక తెలంగాణ రాష్ట్రంలో ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలన రాష్ట్రంలోనిరుద్యోగులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఈ ఆత్మ హత్యలకు ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి ని (డివై యాఫ్ ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్ అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివై యాఫ్ ఐ) ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో షబ్బీర్ మృతిని నిరసిస్తూ స్థానిక సరితాక్లినిక్ సెంటర్ నుంచి సుందరయ్య భవనం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఈరోజు ఆత్మహత్యల తెలంగాణ గా మారిందని ఆయన అన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలకోసం అప్పుడు ప్రాణాలు త్యాగం చేసై తెలంగాణ రాష్ట్రం వచ్చాక వాటిని మరచి రైతులను, ప్రజలను, నిరుద్యోగులను పటించుకోకుండా నిర్లక్ష్యం చేయడం ఫలితంగా ఆత్మహత్య లు చేసుకుంటున్నారు అని ఆయన అన్నారు. ఇదే బంగారు తెలంగాణ అయితే ఇది మాకు వద్దు అని ఆయన అన్నారు. షబ్బీర్ కుటుంబానికి 20లక్షల ఎక్సగేషియా ఇవ్వాలని, వారి కుటుంబానికి ఇళ్లు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్, జిల్లా సహయకార్యదర్శి చింతల రమేష్, కణతాల వెంకటేశ్వర్లు, సత్తెనపల్లి నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా ముత్తారావు, ఇంటూరి అశోక్, దిండు మంగపతి, శీలం వీరబాబు, రోషన్ని ఖాన్, రాసాల నవీన్, కూరపాటి శ్రీను, రావులపాటి నాగరాజు, జూపుడి నరేష్, బొడ్డు మదు, నవీన్, పవన్, నాగరాజు, సైదులు, గోపి, అనిల్, రాంబాబు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు