లాక్ డౌన్ పాటించకపోతే కఠినచర్యలు తప్పవు

Published: Saturday May 22, 2021
ఆలూరులో 2షాపులు సీజ్ - రాయికల్ ఎస్సై జె.ఆరోగ్యం
రాయికల్, మే 21 (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ ప్రకటించింది. ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో తప్ప మిగతా సమయంలో అనవసరంగా ఎవరుకూడా రోడ్లపైకి రాకూడదని అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేసుకుంటామని మరియు  కఠిన చర్యలు తీసుకుంటామని రాయికల్ ఎస్సై జె.ఆరోగ్యం హెచ్చరించారు. లాక్ డౌన్ లో ఉదయం 6 గంటలనుండి 10 గంటలవరకు మాత్రమే వ్యాపారస్తులు తమ షాపులను  తెరిచి ఉంచాలని 10 గంటల తరువాత ఎవరైనా తమ షాపులను తెరిచి ఉంచితే వారి షాపులను సీజ్ చేస్తామని అన్నారు. ప్రజలకోసం మేము రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నామని మీరు మాకు సహకరించాలని కోరారు. నిత్యావసర సరుకులు కొనే సమయంలో కూడా ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని అన్నారు. మనమందరం కలిసి కరోనా మహమ్మరిని ధైర్యంగా ఎదురుకోవాలని సూచించారు.
ఆలూరులో 2 షాపులు సీజ్ 
లాక్ డౌన్ నియమాలు పాటించకుండా నిర్ణీత సమయం దాటినా కూడా తెరిచిఉంచిన 2 షాపులను శుక్రవారం సీజ్ చేశామని ఎవరైనా 10 గంటల తరువాత షాపులు తెరవడం గాని అనవసరంగా రోడ్లపైకి రావడం గాని చేస్థే చర్యలు తీసుకుంటామని అన్నారు.