డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కృషి

Published: Thursday January 12, 2023
కార్పొరేటర్ అమర్ సింగ్
మేడిపల్లి, జనవరి 11 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ అమర్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేటర్ అమర్ సింగ్ డివిజన్లోని 40 ఫీట్ రోడ్డు నెంబర్ 7 లో నెలకొన్న సిసి రోడ్డు ప్యాచ్ పనులను పూర్తి చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్లో మంచినీళ్లు, విద్యుత్, డ్రైనేజ్, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ్, యాదగిరి, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.