అన్ని వర్గాల ప్రజల అభివృద్దే ముఖ్యమంత్రి లక్ష్యం

Published: Friday October 01, 2021
వేతనాల పెంపు పట్ల ఎంపీపీ లలిత హర్షం
మధిర, సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని మధిర ఎంపీపీ మెండెం లలిత పేర్కొన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ వేతనం 30 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. జడ్పిటిసి ఎంపీపీ లకు అదనంగా 3000 కలుపుతూ 15 వేల రూపాయలు చేయగా ఎంపీటీసీ సర్పంచులకు అదనంగా 15 వందలు పెంచుతూ ఆరున్నర వేల రూపాయలు పెంచుతూ గౌరవ వేతనం అందించడం సంతోషదాయకం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆడపడుచులు అమ్మ నాన్నలకు భారం కావద్దని ముందస్తుగా గుర్తించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చారని ఆమె తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు జరిగితే 12 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మరియు కెసిఆర్ కిట్ ను అందిస్తున్నారని ఆమె గుర్తు చేశారు రైతుల కోసం రైతుబంధు రైతు బీమా రుణమాఫీ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం వివిధ కుల మతాల ప్రజలకు కార్పొరేషన్ల పేరిట లోన్లు మంజూరు చేసి ప్రజలందరికీ అన్ని విధాలుగా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో ఆపద్బాంధవుడిగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ కు ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ ఎప్పటికి రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనలోనే తెలంగాణ రాష్ట్రం 70 ఏళ్ల అభివృద్ధి సాధించిందన్నారు ప్రజాప్రతినిధుల వేతనాల పెంపుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.