బడి బాట కార్యక్రమము ప్రారంభించిన తహశీల్దార్

Published: Saturday June 04, 2022

ఇబ్రహీంపట్నం, జూన్ 03 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వర్ష కొండ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల  నమోదు కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుండి ప్రారంభించిన ఆచార్య జయశంకర్ బడి బాట కార్యక్రమము తహసీల్దార్, మహేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, నాణ్యమైన  విద్య తో పాటు ప్రభుత్వము కల్పిస్తున్న  వివిధ  సౌకర్యాలను మీ పిల్లలకు అందివ్వాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ,దొంతుల శ్యామల తుక్కారం, మండల ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షుడు, పొనకంటి చిన్న వెంకట్, ఉప సర్పంచ్, మంగిలి పెళ్లి లక్ష్మణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్, చిన్న రాజన్న,ప్రధానోపాధ్యాయుడు ,గడ్డం శ్రీనివాసరెడ్డి,క్లస్టర్ రిసోర్స్ పర్సన్ శివరాం,
ఉపాద్యాయులు రాజేందర్,మురళి,ఇమ్మనుయెల్,తిరుమల,ఇబ్రహీం,భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

 
 
 
Attachments area