వికారాబాద్ జిల్లా కేంద్రంలో శివాజీ శోభాయాత్ర

Published: Monday February 20, 2023

శివాజీ తండ్రి షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాంషాహీలపై షాజహాన్ దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధుణ్ణి నిజాంషాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు. ఆదివారం జిల్లా కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్రను వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ మాట్లాడుతూ కోట్లాది భారతీయులకు స్ఫూర్తిదాయకుడు, భరతమాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ  మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించామన్నారు. వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి నుండి సంతోషిమాత దేవాలయం వరకు ఘనంగా శోభాయాత్రను నిర్వహించామని స్పష్టం చేశారు. నేటి యువత ప్రతి ఒక్కరు చత్రపతి శివాజీ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకొని, దేశ సంరక్షణ కోసం మనందరం ఇలాగే ఏకతాటిపై నిలబడాలని కోరారు. వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, స్థానిక కౌన్సిలర్ సుధాంశు కిరణ్ పటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు మాధవరెడ్డి, కోటిగారి శివరాజ్, పోకల సతీష్, కేపీ రాజు, ధన్నారం సాయి చరణ్ రెడ్డి, ప్రశాంత్, శివాజీ యూత్ నాయకులు, పట్టణ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.