పట్టణ ప్రగతితో స్పష్టమైన మార్పు రావాలి

Published: Monday July 05, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్, జూలై 04 ప్రజాపాలన బ్యూరో : పట్టణ ప్రగతి ద్వారా వికారాబాద్ మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో స్పష్టమైన మార్పు రావాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మూడవ పట్టణ ప్రగతిలో భాగంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో పర్యటించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... 17వ వార్డులో పర్యటన చేసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పరిశుభ్రత, హరితహారం తదితర కార్యక్రమాలను తనిఖీ చేశారు. మొక్కల చుట్టూ తప్పనిసరిగా పాదులు చేయాలన్నారు. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం అద్భుతమైనది : వికారాబాద్ నియోజక వర్గంలోని షెడ్యూల్ కులాల నాయకులు, మేధావులు సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం పై చర్చించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా దళితులకు విద్యాపరంగా ప్రోత్సహించాలన్నారు. భూమి లేని దళిత రైతులకు కూడా రైతు భీమా వర్తించేలా చేయాలన్నారు. అసలైన లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించాలన్నారు. పథకంపై ప్రత్యేకంగా  అవగాహన కల్పించడానికి ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు. ఉచిత విద్యుత్ సబ్సిడీ 100 నుంచి 200 యూనిట్లుకు పెంచాలన్నారు. ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ పథకం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 1200 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. మొదటి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోని వందమంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు మధ్యవర్తులు లేకుండా స్వయంగా బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం దళితుల అభివృద్ధికి తోడ్పడి, గౌరవంగా జీవించే స్థాయికి ఎదిగేలా కృషి చేస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, దళితుల అభివృద్ధి కోసం చర్చించామన్నారు. మీరు ఇచ్చిన సలహాలను సూచనలను ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేరే విధంగా నేను అనుసంధాన కర్తగా వ్యవరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, DFO వేణు, మున్సిపల్ వైస్ చైర్మన్ శంషాద్ బేగం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, మాజీ జెడ్పిటిసి షరీఫ్, మున్సిపల్ కమీషనర్ బుచ్చయ్య, కౌన్సిలర్ సురేష్ నాయకులు రమణ, AE రాయుడు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments are