న్యూస్ 2 హెడ్ లైన్స్ పెట్టండి సార్

Published: Wednesday September 28, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధి
*ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం వెంటనే వర్తింపజేయాలి*
    
*జె.రుద్ర కుమార్ యూనియన్ జిల్లా కార్యదర్శి*
ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు మరియు ఇతర కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రమాద బీమాను వర్తింపజేయాలని రంగారెడ్డి జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జె.రుద్రకుమర్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
  
*కార్మిక వర్గానికి నూతన కమిటీ ఎన్నిక*

మంగళవారం రోజు  రంగారెడ్డి జిల్లా రోడ్డు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా రెండవ  మహాసభలు తుర్కయంజాల్ లోని స్థానిక రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో ఆలేటి ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది
     ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి యూనియన్ జిల్లా కార్యదర్శి జే రుద్రకుమార్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డి కిషన్ గారు మాట్లాడుతూ జిల్లాలో ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యం  కల్పించాలనీ, ప్రతి ట్రాన్స్పోర్ట్  అడ్డాకు  యూనియన్ రిజిస్ట్రేషన్  సదుపాయం కల్పించాలనీ,  పెట్రోలు డీజీలు గ్యాస్ ధరలపై జీఎస్టీ వర్తింప జేసీ, నిత్యవసర ధరలను తగ్గించాలని, ట్రాఫిక్ పోలీస్ వేధింపులను అరికట్టాలని, విపరీతమైన చలన్లు రద్దు చేయాలనీ, 2019 మోటార్ వెహికల్ వాహన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలనీ, రవాణా రంగాన్ని ప్రభుత్వం ఆధీనంలో కొనసాగించాలనీ అన్నారు.
దేశంలో ఉన్న రైల్వేలు,  ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓడరేవులు. ప్రభుత్వం ఆధీనంలో కొనసాగించాలనీ, వాటిని ప్రైవేటు చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రవాణా రంగం ప్రజలపై రోజువారీ నిత్యవసర ధరల హెచ్చుతగ్గులను నిర్ణయించే శక్తి ఉంటుంది కాబట్టి దేశంలో, రాష్ట్రంలో ఉన్న రవాణా రంగాన్ని ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలనీ, రవాణా కార్మికులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, వారి పిల్లలకు ఉచిత విద్య, సబ్సిడీతో కూడిన నూతన వాహనాలు అందించాలనీ డిమాండ్ చేశారు.
     ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి మధు, కే.సత్యం డి.ప్రేమాజి,ఎల్లయ్య,భాస్కర్, డ్రైవర్లు నందీశ్వర్ శ్రీనివాస్ రామకృష్ణారెడ్డి మధుకర్ రెడ్డి బీరప్ప మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
*అనంతరంనూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది*
జిల్లా అధ్యక్షుడిగా కే. రాములు,
ప్రధాన కార్యదర్శిగా జె.రుద్ర కుమార్,  ఉపాధ్యక్షులుగా ఆలేటి ఎల్లయ్య. జి రాజు, ప్రవీణ్ కుమార్, లక్ష్మణ్ , కుమార్ గౌడ్, నాగేష్ గౌడ్, గుండా బాలరాజ్, మరియు సహాయ కార్యదర్శిగా  కె.సత్యనారాయణ, మహ్మద్ బలాల్, ధర్మారెడ్డి. బీరప్ప, వెంకటేష్ గౌడ్ లతో పాటు కమిటీ సభ్యులుగా మరో 17 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.