వేద జల్లే విధానం ద్వారా రైతులకు లాభాలు: ఏఈఓ సాధన

Published: Friday July 29, 2022
బోనకల్, జులై 28 ప్రజా పాలన ప్రతినిధి: గురువారం గోవిందాపురం ఏ గ్రామంలో వెదజల్లే పద్ధతి ద్వారా వరి సాగు విధానాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన మండల వ్యవసాయ ఏఈఓ సాధన గ్రామానికి చెందిన రైతు భాగం నాగేశ్వరరావు వరి పొలంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఈఓ సాధన మాట్లాడుతూ వెదజల్లే విధానం ద్వారా రైతులకు లాభాలు చేకూరుతాయని ఖర్చు తగ్గుతుందని, తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనేక ప్రోత్సాహాలను ఇస్తున్నదని, అర్హులైన రైతులందరూ ఈనెలాఖరులోగా రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించినారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు కోఆర్డినేటర్ భాగం మధుసూదన్ రావు, భాగం నాగేశ్వరరావు, మేదరమట్ల రమణయ్య, వెంకటేశ్వరరావు ,షేక్ నాగులమీరా,ఏఈఓ సాధన, గ్రామ రైతులు పాల్గొన్నారు.