ఉత్తమ సోషల్ వర్కర్ గా గట్టు ఇందిరా కు అవార్డు ప్రధానం

Published: Tuesday March 09, 2021
బాలాపూర్ :ప్రజాపాలన న్యూస్ ; మహిళదినోత్సవం సంధర్భంగా. గట్టు ఇందిరా కు ఉత్తమ సెవ మహిళా అవర్డ్ అంతర్జాతీయ మహిళదినోత్సవం సంధర్భంగా సిటిజన్ ఫస్ట్ హ్యుమన్ రైట్స్ అసోషియేషన్ సౌత్ జోన్  ఆధ్వర్యంలో మాతృదేవోభవ ఆశ్రమం గట్టు ఇందిరాకు  ఉత్తమసోషల్ వర్కర్ గా అవార్డు ప్రధానం చేశారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో ఉన్న మాతృదేవోభవ అనాధ ఆశ్రమం లో  అంతర్జాతీయ మహిళదినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాలల్లో రాణిస్తున్న మహిళలకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఉదేశ్యంతో  సిటిజన్ ఫస్ట్ హ్యుమన్ రైట్స్ అసోషియేషన్ సౌత్ జోన్  చైర్ పర్సన్ శాలిని జాదవ్, అనురాధ లీలా గార్ల  ఉత్తమ సోషల్ వర్కర్ గా మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ట్రెజరర్ గట్టు ఇందిరాకు  ముఖ్య అతిథి డా, ఉజ్వల బేడీ గారి చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా గట్టు ఇంద్రరా మాట్లాడుతూ.... ఈ అవార్డు అందుకోవడం చాల సంతోషంగా ఉందని,సమాజసేవ పట్ల మరింత బాధ్యతను పెంచిందని మరింత మందికి సేవా కార్యక్రమలను అందిస్తామని మనస్ఫూర్తిగా చెప్పారు