మండల కార్యాలయంలో పోషణ అభియాన్ కన్వర్జేన్స్ మీటింగ్ పాల్గొన్న మండల వివిధ శాఖల అధికారులు

Published: Wednesday September 07, 2022
బోనకల్, సెప్టెంబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని మంగళవారం మండల కార్యాలయంలో మండల అధికారులతో పోషణ అభియాన్ కన్వర్జెన్స్ మీటింగ్ లో పోషణ తగ్గించటానికి తీసుకోవలసిన చర్యలపై సిడిపిఓ శారదా శాంతి చర్చించటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 0-5 సంవత్సరాల పిల్లలు లోప పోషణ గ్రౌత్ కార్డ్స్ గర్భిణీ,కిషోర్ బాలికలు,అనీమియా హెల్త్ క్యాంప్ ,బరువు తక్కువగా వున్న పిల్లలకు ఆరోగ్య పరిస్థితులు పరిశీలించాలని, అంగన్వాడి సెంటర్స్,గ్రామాల్లో స్కూల్ లో పిల్లల కోసం, కిషోర్ బాలికలకు, గర్భిణీ బాలింతలు కొరకు న్యూట్రి గార్డెన్ పెంచటం కోసం స్థలం సేకరించి కూరగాయల తోట ఏర్పాటు చేయాలని అన్నారు. 
ఈ కార్యక్రమములో ఎంపీడీవో వేణుమాధవ్, తాసిల్దార్ రావూరి రాధిక, ఎం ఈ ఓ ఇందిరా జ్యోతి, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, అంగన్వాడి సూపర్వైజర్ రమాదేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రo డాక్టర్ శ్రీకాంత్, అన్ని సెంటర్ల డాక్టర్లు, ఏపిఎం పద్మలత, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area