న్యాక్ అందిస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి లైన్స్ క్లబ్ జోన

Published: Wednesday November 02, 2022
మధిర అక్టోబర్ 30 ప్రజా పాలన ప్రతినిధి
మండలం పరిధిలో మాటూరు  గ్రామంలో
 న్యాక్ సంస్థ అందిస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణా తరగతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని టిఆర్ఎస్ జిల్లా నాయకులు కౌన్సిలర్ లైన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ మల్లాది వాసు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని మాటూరు గ్రామంలోని రైతు వేదికలో న్యాక్ ద్వారా శిక్షణ పొందిన కార్మికులకు యూనిఫామ్, హెల్మెట్, నోట పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్లాది వాసు మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన మధిర మండలంలో వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు, మహిళలకు న్యాక్ సంస్థ ఉచితంగా వృత్తి నైపుణ్యంపై శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. ఈ శిక్షణా తరగతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని కార్మిక శాఖ ద్వారా అందే సంక్షేమ పథకాలను పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో న్యాక్ బాధ్యులు వెంకటకృష్ణ, పవిత్ర ఎంపీటీసీ అడపా వెంకటేశ్వరరావు, మేడిశెట్టి నాగేశ్వరావు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.