పూలపల్లి గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి

Published: Wednesday February 01, 2023
* గ్రామ సర్పంచ్ మర్పల్లి నర్సింహారెడ్డి
వికారాబాద్ బ్యూరో 31 జనవరి ప్రజా పాలన : అన్ని రంగాలలో పూలపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని గ్రామ సర్పంచ్ మర్పల్లి నర్సింహారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పూలపల్లి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ వివిధ శాఖల నివేదికలు అందుబాటులో లేనందున గ్రామసభను వాయిదా వేశామని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేయుటకు కృషి చేస్తున్నామని వివరించారు. గ్రామంలో సిసి రోడ్లు అండర్ డ్రైనేజీ నిర్మాణాలు కొంతవరకు పూర్తి చేశామని మిగిలిన పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఒకటవ వార్డు మెంబర్ చెల్క సుదర్శన్ రెడ్డి వార్డులో త్వరలో సీసీ రోడ్లు అండర్ డ్రైనేజీ నిర్మాణం పనులు ప్రారంభించనున్నామని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని మార్చి 13, 14 తేదీలలో నిర్వహించనున్నామని అన్నారు. ఇంటి పన్నులు మార్చి మాసాంతం వరకు వసూలు చేయాలనుకున్న లక్ష్యాన్ని ముందుగానే 100% వసూలు చేశామని స్పష్టం చేశారు. గ్రామ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే నా దృష్టికి తేవాలని సూచించారు. అనునిత్యం గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జ్యోతి బాలకృష్ణ గౌడ్ పంచాయతీ కార్యదర్శి భానుప్రియ ఒకటవ వార్డ్ మెంబర్ చిలక సుదర్శన్ రెడ్డి రెండవ వార్డ్ మెంబర్ సుమతమ్మ ఏఎన్ఎం పద్మ ఆశా వర్కర్ నారెగూడెం జ్యోతి క్షేత్రపాలకుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు