హ్యాపీ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాస్ రెడ్డి

Published: Tuesday February 08, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 7 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ డివిజన్ పద్మావతి కాలనీలో కాలనీ ఉపాధ్యక్షులు మేకల వేణుగోపాల్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని స్థానిక నాయకులతో కలసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛము అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, పిట్టల నరేష్ ముదిరాజ్, ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు వేముల సంతోష్ రెడ్డి, చిల్కానగర్ డివిజన్ అధ్యక్షులు పల్లె నర్సింగ్ రావు, కొంపల్లి రవీందర్ ముదిరాజ్, టంటం వీరేశం, గుడి మధుసుధన్ రెడ్డి, ఈరెల్లి రవీందర్ రెడ్డి, చిల్కానగర్ డివిజన్ మాజీ అధ్యక్షులు చేర్యాల శ్రీనివాస్, వేముల పరమేష్, మైనారిటీ అధ్యక్షులు SK అబ్బు భాయ్, కొంపల్లి రాజు ముదిరాజ్, చిల్కానగర్-ఉప్పల్ డివిజన్ల యూత్ అధ్యక్షులు సీత రాజు యాదవ్, అరటికాయల వంశీకృష్ణ ముదిరాజ్, చిలుగురి శ్రీకాంత్, బండి లింగన్న, మధు, వలబోజు శ్రీకాంత్ చారి, కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.