కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత భోజన పంపిణీ

Published: Tuesday June 01, 2021

మచిర్యాల టౌన్, మే31, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఉచిత భోజన సౌకర్యం ఎనిమిదవ రోజు కొనసాగింది. సోమవారం యువజన కాంగ్రెస్ శ్రేణులు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో 850 మందికి మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా ఒక గుడ్డుతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు సళ్ళ మహేష్ మాట్లాడుతూ లాక్ డౌన్ ఎన్ని రోజులు కొనసాగినా, ఎంత మందికైనా రెండు పూటలా భోజన సౌకర్యం ట్రస్టు ద్వారా కల్పిస్తామని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లు, వారి సహాయకులు ఒక్క పూట కూడా భోజనానికి ఇబ్బంది పడకూడదని అందుకు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడేది లేదని కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నట్లు వారు తెలిపారు. అంతేకాకుండా ఈ కరోన విపత్కర పరిస్థితులలో మాస్కులు పంపిణీ ,వీధి వీధిలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ, ఉచిత మంచి నీటి సరఫరా, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి 210 ఆక్సిజన్ సిలిండర్లు, వివిధ ఆస్పత్రులలో కరోన తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రభుత్వ ధరకే రేమిడేసివీర్ ఇంజక్షన్లు అందించిన ఘనత ప్రేమ్సాగర్ రావు కే దక్కుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుమల్, జిల్లా జనరల్ సెక్రటరీ సాయి సింగ్ ఠాకూర్, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ హర్ష పటేల్, లక్సెట్టిపేట మండల అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్, నస్పూర్ ఉపాధ్యక్షుడు జిమ్మిడి రాజేందర్, నరేష్, పండు, శ్రీనివాస్, నాయకులు పవన్, ప్రేమ్ సింగ్, కెమెర రాజుకుమార్, జుమ్మిడి రామకృష్ణ, రాందేని చిన్న వెంకటేష్, చందు, ముజ్జు, చంద్రమౌళి, రాజకుమార్, తదితరులు పాల్గొన్నారని తెలిపారు.