పూర్తి కాని వంతెన-తప్పని తిప్పలు

Published: Monday June 20, 2022
హైదరాబాద్ 19 జూన్ ప్రజాపాలన: వర్షాకాలం వచ్చినా పూర్తి కాని మంతపురి వంతెన నిర్మాణం పనులు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామ సమీపంలో రహదారులు మరియు భవనాల శాఖ కు సంబంధించిన వంతెన నిర్మాణం పనులు పూర్తి చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు సంబంధిత గ్రామ ప్రజలు అభిప్రాయపడ్డారు. ఆలేరు నుండి అమ్మనబోలు కు వెళ్ళే రోడ్డు మీద మంతపురి గ్రామ సమీపంలో వంతెన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం సిమెంట్ స్లాబ్ వేయడానికి ఇనుప కడ్డీ లను పరిచి నారు. చాలా కాలంగా వర్షాకాలం వచ్చిందంటే  చుట్టు ప్రక్క గ్రామాల  ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బహదూర్ పేట, మంతపురి, ఇక్కూర్తి, శర్బనాపురం,మాటూరు, జిలాల్ పురం మరియు మోటకొండూరు తదితర గ్రామాలను కలిపే రోడ్డు. మంతపురి గ్రామ సమీపంలో వంతెన నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసినట్లైతే సంబంధిత గ్రామాల ప్రజలకు రవాణాసౌకర్యం సులభంగా ఉంటుందన్నారు. వానాకాలం సమీపించినా వంతెన నిర్మాణం పనులు పూర్తి కాలేదు. ఈ సంవత్సరంలో కూడా సంబంధిత గ్రామాల  ప్రజలకు తిప్పలు తప్పవు అని పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు అభిప్రాయపడ్డారు. సంబంధిత అధికారులు కాంట్రాక్టర్  వెంటనే వంతెన నిర్మాణం పనులు వేగవంతం చేసి ప్రజలకు రవాణాసౌకర్యం కలిగించాలని పలువురు కోరుతున్నారు.
 
 
 
Attachments area