ఓల్డ్ క్లాత్ బ్యాంకుకి పాత దుస్తులు వితరణ

Published: Monday September 19, 2022

మధిర రూరల్ సెప్టెంబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి పట్టణంలో ఆజాద్ రోడ్లో ప్రముఖ సామాజిక సేవకులు (లంకా సేవ ఫౌండేషన్ నిర్వాహకులు) లంకా కొండయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ ఓల్డ్ క్లాత్ బాంక్కు ఆదివారం పలువురు దాతలు పాత దుస్తులను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా లంకా కొండయ్య మాట్లాడుతూ అనేకమంది గృహాల్లో అవసరానికి మించి దుస్తులు ఉంటాయన్నారు వాటిని సేకరించి మహాత్మా గాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంకు ద్వారా పేదలకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. వేమూరు సునీల్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు దొడ్డ శ్రీనివాసరావు మధిర వినాయకుడి గుడి పూజారి హరి రవి శాస్త్రి, అవధానుల రామకృష్ణ శాస్త్రి తదితరులు తమ తమ నివాసాల్లో అదనంగా ఉన్న దుస్తులను మహాత్మా గాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంకుకు వితరణగా అందించినట్లు ఆయన తెలిపారు. ఈ బట్టలను వైరా మండలం కేజీ సిరిపురం గ్రామానికి చెందిన వృద్ధ కళాకారులకు అందించినట్లు లంకా కొండయ్య వివరించారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరు తమ ఇంట్లో అదనంగా ఉన్న దుస్తులు, ఉపయోగంలేని దుస్తులు ఓల్డ్ క్లాత్ బ్యాంక్ అందిస్తే అవి మరొకరు ఉపయోగపడతాయని, ఆయన  తెలిపారు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ నిరుపయోగంగా ఉన్న పాత దుస్తులను వితరణ చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లంక ఫౌండేషన్ సభ్యులు లంకా కరుణా, లియోనా, శ్యామ్, అంజి, గోపి, సాయి, పండు తదితరులు పాల్గొన్నారు.