డ్రైనేజీలలోని పూడిక మట్టిని తీయండి బోయపల్లి ఎస్సీ, ఎస్టీ కాలనీవాసుల విజ్ఞప్తి.

Published: Tuesday December 06, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 5 ప్రజా పాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా  తాండూర్ మండలం  బోయపల్లి  గ్రామ పంచాయతీలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలలో గతంలో నిర్మించిన డ్రైనేజీలు పూర్తిగా మట్టిలో కూడుకుపోయి, డ్రైనేజీ వ్యవస్థ పాడై పోవడం వల్ల, నీరు ఇండ్ల మధ్యలోనే నిల్వ ఉండి, గ్రామస్తులు అనారోగ్యాల బారిన పడుతున్నారని, వెంటనే  కాలనీల్లో నూతన  డ్రైనేజీలను ఏర్పాటు చేయాలని జిల్లా బిజెపి అధికార ప్రతినిధి, శ్రీకృష్ణదేవరాయలు స్థానిక ఎంపీడీవోకు సోమవారం విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలలో, ఇండ్ల ముందే మురికి నీరు నిల్వ ఉండడం వలన పేద ప్రజలంతా అనారోగ్యాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని, గ్రామపంచాయతీ అధికారులు, మండల అధికారులు, తక్షణమే స్పందించి  డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలని,
 సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.