ఇల్లూరు హైస్కూల్ ని తనిఖీ చేసిన కమల్ రాజు

Published: Friday July 29, 2022

మధిర రూరల్ జులై 28 ప్రజా పాలన ప్రతినిధి మండలంలోని ఇల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. పాఠశాలలో మొత్తం ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు? ఎంతమంది హాజరయ్యారు? ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఈ సంవత్సరం కొత్తగా ఎంతమంది విద్యార్థులు చేరారు? తదితర అంశాలను సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రుచికరంగా పెడుతున్నారా? లేదా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలన్నారు. మన ఊరి మనబడి పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ భోజనం అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరావు సర్పంచ్ కోట రామారావు టిఆర్ఎస్ మండలాధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు కూనా నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు