పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి...

Published: Wednesday July 14, 2021
మున్సిపల్ చైర్ పర్సన్ రణవేని సుజాత సత్యనారాయణ
మెట్ పల్లి, జూలై 13 (ప్రజాపాలన ప్రతినిధి) : సమాజంలో పారిశుద్ధ కార్మికులు ప్రజలకు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని మెట్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రణవేని సుజాత సత్యనారాయణ అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఒక చెద్దర్, రెండు ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ కార్మికులు నిరంతరం కృషి చేస్తారని అన్నారు. అదేవిధంగా పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సహకారంతో పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రతి వార్డు లో సిసి రహదార్ల నిర్మాణం, పారిశుద్ధ్యం లోపించకుండా మురికి కాలువల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నెల నీటిని సరఫరా చేయడానికి అవసరమైన కృషి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు హరితహారం లో భాగస్వాములు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు. రాష్ట్రంలోనే మెట్ పల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు సాధించడానికి కలిసికట్టుగా పని చేద్దామన్నారు. ఇందుకు ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వార్డు కౌన్సిలర్లు అంగడి పురుషోత్తం, బంగారు కాళ్ళ కిశోర్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు పన్నాల మాధవ రెడ్డి, నాయకులు భీమనాతి సత్యనారాయణ, బర్ల రమేష్, నవాబ్, ఎనగందుల శ్రీనివాస్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సానిటరీ ఇన్స్ పెక్టర్ అక్షయ్ కుమార్, సిబ్బంది ముజీబ్, రమేష్, ధర్మేంధర్ తదితరులు పాల్గొన్నారు.