రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర సర్కార్.. --ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

Published: Monday October 10, 2022

జగిత్యాల, అక్టోబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల ఎమ్మేల్యే క్వార్టర్స్ లో ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్  మీడియా సమావేశం  నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగములో విప్లాత్మకమైన మార్పులు జరిగాయి అని 24 గంటలతో రైతుకు బాధలు తప్పాయి అన్నారు. జగిత్యాల నియోజకవర్గం లో వరి సాగు 2014 లో 26 వేల ఎకరాలు
2018 లో41 వేల  2022 70 వేల ఎకరాలలో సాగు పెరిగింది అన్నారు. 2014 లో 68.14 లక్షల టన్నులు ధాన్యం దిగుబడి 2021 లో 218.53 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి పెరిగింది అన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఉంది అన్నారు. రాష్ట్రం లో 63 లక్షల రైతుల ఖాతాల్లో రైతు బందు ద్వారా 57 వేల కోట్ల రూపాయలు జమ అవుతుంది అన్నారు. కేంద్ర బీజేపీ సర్కార్  ధాన్యం ఎగుమతులు అడ్డుకొని, ఎగుమతులు నిషేధించడం వల్ల వ్యవసాయం రంగ నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర సర్కార్ అని అన్నారు. ఇతర దేశాలకు బియ్యం ఎగుమతి పై 20 శాతం సేస్ విధించడం బాధాకరం అన్నారు. ఇలాంటి బీజేపీ తీరుపై జీవన్ రెడ్డి ఎందుకు విమర్శించరు అన్నారు. బీజేపీ కాంగ్రెస్ రహస్య దోస్తీ అన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాల రామచందర్ రావు, పిఎసిఎస్ చైర్మన్లు ఏనుగు మల్లారెడ్డి, పత్తి రెడ్డి మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, రాజలింగం, నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.