ఘనంగా రమణారావు జన్మదిన వేడుకలు --ప్రెస్ క్లబ్ కు మైక్ సెట్ అందించిన ఓరుగంటి అభిమానులు

Published: Wednesday August 24, 2022

జగిత్యాల, ఆగస్టు, 23 ( ప్రజాపాలన ప్రతినిధి): తెరాస సీనియర్ నాయకులు ఓరుగంటి రమణారావు జన్మదిన వేడుకలను అభిమానుల ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాలలో ఘనంగా జరిగాయి. సీనియర్ తెరాస నాయకులు, మలిదశ ఉద్యమనేత ఓరుగంటి రమణారావు 58 జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు, అనుచరులు విద్యానగర్లోని రామాలయంలో పూజలు చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో, మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు భోజనాలు, పండ్లు పంపిణి చేశారు. అలాగే వాల్మీకి అవాసంలో విద్యార్థుల ఒక్కరోజు ఖర్చు కింద మూడు వేల రూపాయలను అంధజేశారు. జగిత్యాల ప్రెస్ క్లబ్ తో జరుగుతున్న మేలును గుర్తించిన ఓరుగంటి అభిమానులు ప్రెస్ మీట్ల నిర్వహణ సమయంలో వినియోగపడేలా పదివేల రూపాయల విలువైన హ్యాండ్ మైక్ సెట్ ను ప్రెస్ క్లబ్ బాద్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఓరుగంటి అభిమానులు మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించింది రమణారావు అన్నారు. తెలంగాణ కావాలన్న ఆకాంక్షను జగిత్యాల పరిసరాల్లో ఇంటింటికి చేర్చడంలో సఫలీకృతమై ఉద్యమ తీవ్రతను ఢిల్లీకి చేర్చిన ఘనత రమణారావు దని కోనియాడారు. కార్యకర్తలకు వెన్నంటివుంటూ తెరాస బలోపెతానికి కృషి చేస్తున్న రమణారావును ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి సముచితస్థానం కల్పించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో జగిత్యాల ప్రెస్ క్లబ్ బాద్యులు, పాత్రికేయులతోపాటు అభిమానులు నాచుపెల్లి రెడ్డి, ముస్కరి బాలాజీ, ప్రభాకర్ రావు,చిత్తారి మధుకర్, సిరికొండ  సింగారావు, శేకర్, రాజిరెడ్డి , శ్రీనివాస్, భైర్నేని రాజేశ్వేర్ రావు,చంద సాయి కుమార్, జంగ గణేష్, నరేష్, శంకర్, సురేష్ లు ఉన్నారు.