ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం పెట్టాలి . పిడిఎస్యు జిల్లా కార్యదర్శి తిరుపతి **

Published: Tuesday September 06, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 05 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పిడిఎస్యు ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలను  పరిష్కరించాలన్నారు. పాఠశాలల్లో  మధ్యాహ్న భోజనానికి ప్రతి విద్యార్థికి కేవలం రూ 5 మాత్రమే  ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. బయట 5 రూ లకు టీ కూడా రాదని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎలా అందిస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే మధ్యాహ్న భోజనానికి ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థులకు పాఠశాలలో మధ్యాహ్న భోజనం లో ప్రతి రోజు మెనూ పాటించాలని కోరారు. పాఠశాలల్లో ఉన్న ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యార్థి సంఘం (పిడిఎస్యు) డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు కళ్యాణ్, అజయ్, విలాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area