తెలంగాణ ఉధ్యమ కారుడు గుంజపడుగు ఘనంగా జన్మదిన వేడుకలు...

Published: Friday July 08, 2022

కరీంనగర్ జూలై 7 ప్రజాపాలన :

తెలంగాణ ఉద్యమకారుడు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ జన్మదినవేడుకలు స్థానిక తారక హోటల్లో ఘనంగా జరిగాయి.

 ఈ జన్మదిన వేడుకలలో  నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, మాజీ కార్పోరేటర్లు సాదవేణి శ్రీనివాస్, కన్న కిష్ణ పాల్గొని ఆత్మీయ సన్మానం చేసి జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గాడిచర్ల కొమరయ్య, సుడ డైరెక్టర్ తోట మదు, మన్నెంపల్లి ఉప సర్పంచ్ పోన్నం అనిల్ గౌడ్, తెలంగాణ ఉద్యమకారుడు ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి, రజక సంఘం ప్రధాన కార్యదర్శి కుమార్, సిరిసిల్ల గ్రంథాలయం డైరెక్టర్ మల్లెంకి శ్రీనివాస్, కరీంనగర్ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిరాల వెంకటస్వామి, నాయకులు శ్రీరాముల వేంకటేశ్వర్లు, గర్శకుర్తి రాజశేఖర్, ప్యాట సురేష్, ఠాగూర్ సాయిసింగ్, రకేష్ మింటు, సాదవేణి వినయ్, మునీంద్రా, వినిత్  తదితరులు పాల్గొన్నారు.