వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేసినట్లే: జిల్లా కన్వీనర్ సునీల్ మాదిగ

Published: Tuesday July 26, 2022
 మండల కేంద్రంగా నిరసన దీక్ష ప్రారంభం
 
బోనకల్, జులై 25 ప్రజా పాలన ప్రతినిధి: ప్రస్తుత పార్లమెంట్లోని ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధ కల్పించాలని మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మండల కేంద్రంగా ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ కూరపాటి సునీల్ మాదిగ నిరసన దీక్షను ప్రారంభించారు. మండల ఎమ్మార్పీఎస్ మండల నాయకులు , జిల్లా నాయకులు కోట హనుమంతు మాదిగ, తాటికొండ వెంకటరత్నం మాదిగ, తోటపల్లి చిన్న సైదులు మాదిగ ఆధ్వర్యంలో నిరసన దీక్ష ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ కూరపాటి సునీల్ మాదిగ మాట్లాడుతూ వర్గీకరణ పై బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని, మాట ఇచ్చి వర్గీకరణ చేయకుండా ఉండటం మాదిగలను మోసం చేయటమేనని ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధ కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేకుంటే రాజకీయ పతనం తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన దీక్షకు మండల వైయస్సార్ టిపి నాయకులు ఇరుగు జ్ఞానేశ్, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ పంతు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల గౌరవ సలహాదారుడు తోటపల్లి సాల్మన్ రాజ్ మాదిగ, తోటపల్లి వెంకటేశ్వర్లు మాదిగ ,బలవంతపు నరసింహారావు మాదిగ, బొల్లిపోగు రామారావు మాదిగ, మర్రి కంటి గంగాధర్ మాదిగ, వేల్పుల పవన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.