సహకార సంఘం ద్వారా సభ్యులకు ఆర్థిక సహకారం

Published: Friday October 01, 2021
శివారెడ్డిపేట్ పిఏసిఎస్ చైర్మన్ మాసనగారి ముత్యంరెడ్డి
వికారాబాద్ బ్యూరో 30 సెప్టెంబర్ ప్రజాపాలన : ఒకరి కోసం అందరు అందరి కోసం సంఘం అనే సూత్రాన్ని అనుసరించి సహకారోద్యమంలో సమాజాభివృద్ధికి తోడ్పడే విధంగా ఆర్థిక చర్యలు చేపడుతున్నామని శివారెడ్డిపేట్ పిఎసిఎస్ చైర్మన్ మాసనగారి ముత్యం రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో మహాజన సభ ముందు సంవత్సర ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1987లో ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టి ఆ తర్వాత ఒకే సంస్థ ద్వారా సభ్యులకు స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలను అందిస్తున్నామని వివరించారు. స్వల్పకాలిక రుణాల కింద చెల్లించే ప్రతి సభ్యునికి మరుసటి రోజున అప్పులు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. సంఘం యొక్క పరిధిలో 40 రెవెన్యూ గ్రామాలు మండల పరిధిలో విస్తరించి ఉన్నదని గుర్తుచేశారు. సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య 11,540 కాగా 5378 సభ్యులు సభ్యత్వమునకు అర్హులు మిగతా వారు6162 మంది తాత్కాలిక సభ్యులు గా ఉన్నారని పేర్కొన్నారు. ఎస్సీ 12 79 ఎస్టీ 592 బిసి 17 21 ఓసి 17 86 మొత్తం సభ్యులు 53 78 మంది ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో పిఏసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్, పిఏసిఎస్ వైస్ చైర్మన్ గడ్డమీది పాండు ముదిరాజ్, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు జె.రత్నారెడ్డి, జడ్పిటిసి మాజీ చైర్మన్ ముత్తహర్ షరీఫ్, పాలకవర్గ సభ్యులు కే జనార్దన్ రెడ్డి, అనంతయ్య, బి లక్ష్మమ్మ, జై వెంకట్ రెడ్డి, వీరారెడ్డి, నర్సింలు, పెంటమ్మ, విమలమ్మ, శ్రీనివాస్ రెడ్డి, మేక రామ్ రెడ్డి సహకార సంఘం సభ్యులు వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.