ఒప్పంద పద్దతిన పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Friday January 06, 2023
మంచిర్యాల బ్యూరో,  జనవరి 5, ప్రజాపాలన :
 
జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టులను ఒప్పంద పద్ధతిన భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టుల నియామకం కొరకు అర్హులైన ఎం.బి.బి.ఎస్./బి.ఎ.ఎం.ఎస్./బి.ఎస్సి నర్సింగ్/జి.ఎన్.ఎం. అభ్యర్థుల నుండి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని, బి.ఎస్సి నర్సింగ్, జి.ఎం.ఎం. అభ్యర్థులు 2020 సంవత్సరం కంటే ముందు ఉత్తీర్ణులై విధిగా 6 నెలల కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసి ఉండాలని, దరఖాస్తు ఫారము, ఇతర వివరాల కొరకు మంచిర్యాల జిల్లా అధికారిక వెబ్సైట్ mancherial.telangana.gov.in నుండి పొందవచ్చని, పూర్తి చేసిన దరఖాస్తు ఫారమును అవసరమైన అన్ని సర్టిఫికెట్ ధృవీకరించిన నకలు కాపీలను జతపరుస్తూ ఈ నెల 7వ తేదీ ఉదయం 10.30 గం||ల నుండి 9వ తేదీ సాయంత్రం 5 గం||ల లోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో స్వయంగా సమర్పించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.