భూముల కబ్జాపై అఖిలపక్ష సమావేశం

Published: Thursday March 09, 2023

జన్నారం, మార్చ్ 08, ప్రజాపాలన: మండలంలోని అన్ని 34 గ్రామాలల్లో ఉన్న చెరువు భూముల కబ్జాపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో అన్ని పార్టీ సంఘాల నాయకులు అఖిలపక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో 29 గ్రామపంచాయతీల చెరువుల భూముల అక్రమ గురించి అట్టి ఉద్దేశించి ఉన్నత అధికారులకు తెలియజేయుటకు ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి మండల చెందిన రైతులు, ప్రజాసంఘ నాయకులు, గంగపుత్ర సంఘం సభ్యులు, మత్స్య కార్మికులు  గీత కార్మికులు, ఇతరులు పాల్గొన్నారు. మండలంలోని చెరువుల భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. చెరువు శిఖం భూములు కబ్జాదారుల పేరున పట్టాలు ఉన్నట్లయితే వాటిని వెంటనే కొట్టివేసి చెరువు భూములుగా ప్రకటించాలన్నారు.  ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళిందర్ ఖాన్, బి.ఆర్.ఎస్ నాయకులు రాజారాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు బోర్లకుంట ప్రభుదాస్, బిజెపి నాయకులు కొండపల్లి మహేష్, నస్పూరి శ్రావణ్, నల్లపు కృష్ణ,సిపిఐ మండల అద్యక్షుడు దాసరి తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలంలోని చెరువుల భూముల కబ్జా విషయములో మండల కమిటీ పోరాటం కమిటీ వేయడమైనదన్నారు.ఈ మండల కమిటీ కన్వీనర్ గా జిల్లా భీమయ్య కన్వీనర్లుగా సుతారి వినయ్, ముత్యం రాజన్న, దాముక కరుణాకర్, గవ్వల శ్రీకాంత్, కన్లే శ్రావణ్, బద్రి నాయక్, మామిడి విజయ్, మామిడి ఇందయ్య, భరత్ కుమార్, మూల భాస్కర్ గౌడ్, నాయక్, గట్టు మహేష్, వాసాల నరేష్, తదితరులు  పాల్గొన్నారు.