అంబెడ్కర్ విగ్రహం చుట్టూ చెత్తను తొలగించారు

Published: Wednesday February 23, 2022
బోనకల్, ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలో గోవిందాపురం (ఎ) గ్రామంలో పారిశుద్ధ్య పనులు సర్పంచ్ భాగం శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి హిమబిందు ఆధ్యర్యంలో యస్.సి కాలనీ, స్కూల్, అంబెడ్కర్ విగ్రహం చుట్టూ చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భాగం శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరూ పరిశుభ్రత పాటించాలని, ఎవరి ఇళ్లలో వారు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ ఇంటింటికి వెళ్లి గ్రామ పంచాయితీ ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ చేపట్టారు. ఈ పారిశుధ్య పనులలో మల్టీ పర్పస్ వర్కర్స్, దార సురేష్, రా‌ములు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.